మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 14:16:36

సినారె ఆడిటోరియానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

సినారె ఆడిటోరియానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్ : జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత,  డాక్ట‌ర్ సీ నారాయణ రెడ్డి  89 వ జయంతిని పురస్కరించుకుని  సినారె ఆడిటోరియం నిర్మాణానికి రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ ఆడిటోరియాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో నిర్మించ‌నున్నారు. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.   


ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సినారె జ‌న్మించిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని తెలిపారు. ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన తొలి ర‌చ‌యిత‌, క‌వి కూడా సినారె అని కేటీఆర్ పేర్కొన్నారు. 3 వేల చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఈ ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నాం. వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 
logo