బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:47

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌లు.. రయ్‌ రయ్‌

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌లు.. రయ్‌ రయ్‌

  • జెండాఊపి ప్రారంభించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ 
  • సొంతడబ్బుతో ఆరు అందజేత
  • కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లుగా నామకరణం
  • అంబులెన్స్‌లు ఇస్తామన్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తన జన్మదినం సందర్భంగా   ఇచ్చిన హామీని వారం రోజుల్లో నెరవేర్చారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం తన సొంత డబ్బుతో ప్రభుత్వ దవాఖానలకు ఆరు అంబులెన్స్‌లు అందజేశారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అంబులెన్స్‌లకు జెండాఊపి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు అప్పగించారు. వీటికి కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లుగా పేరు పెట్టారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర   చికిత్సకు అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు, పరికరాలు, యంత్రాలు ఉన్నాయి.  

తన పిలుపునకు స్పందించిన టీఆర్‌ఎస్‌   ప్రజాప్రతినిధులు దాదాపు 100 వరకు అంబులెన్స్‌లు ఇవ్వడానికి ముందుకొచ్చారని పేర్కొంటూ.. వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టీ రాజయ్య, మంత్రి కేటీఆర్‌ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.logo