బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 01:19:58

మరో 10 గిఫ్ట్‌ ఏ స్మైల్‌ వాహనాలు

మరో 10 గిఫ్ట్‌ ఏ స్మైల్‌ వాహనాలు

  • ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు అందజేసిన మరో 10 అంబులెన్సులు సేవలకు కదిలాయి. అంబులెన్స్‌లను శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రెండేసి చొప్పున, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అరెకపూడి గాంధీ, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి ఒక్కో వాహనాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్‌ వారిని అభినందించారు. logo