శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 18:33:14

పీఆర్‌టీయూ డైరీ, క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

పీఆర్‌టీయూ డైరీ, క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్ : పీఆర్‌టీయూ తెలంగాణ డైరీ, క్యాలెండ‌ర్‌, 2021ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధ‌వారం ఆవిష్క‌రించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రైతు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వతి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె అనంత్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారెడ్డి అంజిరెడ్డి, ఎం చెన్నయ్య మంత్రి కేటీఆర్‌కు లేఖ అందజేశారు. ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. logo