శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 14:27:24

హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’

హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’

హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది.  పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. చెరువులు, పార్కులు, బహిరంగస్థలాల్లో కబ్జాకు పాల్పడినా, ఇతర కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వానికి తెలిపేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది.  దీనికోసం జీహెచ్‌ఎంసీ  ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ ను ఏర్పాటు చేసింది. 

అస్సెట్‌ ప్రొటెక్షన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 0099ను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రజలు కలిసి రావాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ పనిచేయనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 
logo