బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 11:25:06

మరో ఎలివేటెడ్‌ కారిడార్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

మరో ఎలివేటెడ్‌ కారిడార్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌ఆర్‌డీపీ కింద మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

రూ. 523.37కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్‌ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఇందులో ఫ్లై ఓవర్‌ పొడవు 2.580 కిలోమీటర్లు. ఈ ఫ్లై ఓవర్‌పై రెండువైపులా రెండేసి లేన్లలో వాహనాలు ప్రయాణం సాగించవచ్చు. దీనిని 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


logo