శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 06:49:18

523 కోట్లతో మరో ఉక్కువంతెన.. నేడు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

523 కోట్లతో మరో ఉక్కువంతెన.. నేడు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్ : న‌గ‌రంలో ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు మరో ఉక్కువంతెన నిర్మించాలని సర్కారు సంకల్పించింది. రూ. 523.37కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్‌ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఇందులో ఫ్లై ఓవర్‌ పొడవు 2.580 కిలోమీటర్లు. ఈ ఫ్లై ఓవర్‌పై రెండువైపులా రెండేసి లేన్లలో వాహనాలు ప్రయాణం సాగించవచ్చు. దీనిని 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 


logo