శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 17:47:22

ఆసుపత్రుల్లో 5రూపాయల భోజనానికి ఏర్పాట్లు : కేటీఆర్‌

ఆసుపత్రుల్లో 5రూపాయల భోజనానికి ఏర్పాట్లు : కేటీఆర్‌

ఎర్రగడ్డ లో వ్యాధినిరోధక మందు స్ప్రే చేస్తున్న ప్రాంతాన్ని మినిష్టర్ కేటీఆర్ప రిశీలించారు. పక్కనే ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి కరోన గురించి అవగాహన కల్పించారు. అక్కడున్నవారికి సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. అలాగే చేతులను సానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందుకే స్ప్రే కూడా చేస్తున్నామని, బయపడనవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

రోడ్ పైన వెళ్లే ద్విచక్ర వాహనదారుణ్ణి బైయట తిరుగొద్దని చెప్పారు. తాము ఉంటున్న హాస్పటల్ లో ఆహారం అందటం లేదని కేటీఆర్ కి చెప్పడంతో, రేపటి నుండి 5 రూపాయల భోజనం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.logo