ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 12:11:55

అడిక్‌మెట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం

అడిక్‌మెట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం

హైద‌రాబాద్ : రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ న‌గ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అడిక్‌మెట్‌లో కొత్త‌గా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. రూ. 2.66 కోట్ల‌తో నిర్మించిన ఈ బ‌హుళ వినియోగ క్రీడా భ‌వ‌న కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింట‌న్ కోర్టు, టేబుల్ టెన్నిస్‌, జిమ్ సౌక‌ర్యంతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు వ‌స‌తులు క‌ల్పించారు. 

ఈ ప్రారంభ‌మ కంటే ముందు.. దోమ‌ల‌గూడ‌లో జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌య ప‌నుల‌కు, నారాయ‌ణ‌గూడ‌లో మోడ్ర‌న్ మార్కెట్ నిర్మాణ ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం బాగ్ లింగంప‌ల్లిలోని లంబాడీ తండాలో రూ. 10 కోట్ల 96 ల‌క్ష‌ల‌తో నిర్మించిన 126 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను కేటీఆర్ ప్రారంభించారు.


logo