ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 07:47:27

ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌నున్న కేటీఆర్‌

ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌నున్న కేటీఆర్‌

హైద‌రాబాద్‌: రాజ‌ధాని న‌గ‌రంలో చేప‌ట్టిన ప‌లు అభివృద్దిప‌నుల‌ను మున్సిప‌ల్ శాఖా మంత్రి కేటీఆర్  ప్రారంభించ‌నున్నారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో భాగంగా లింక్ రోడ్ల నిర్మాణాల‌ను చేప‌ట్టింది. దీంతో పూర్త‌యిన ర‌హ‌దారుల‌ను ఒక్కొక్క‌టిగా ప్రారంభిస్తున్నది. ఇందులో భాగంగా ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌కు నందిహిల్స్ లింక్‌రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి పాత ముంబై రోడ్డు లెద‌ర్ పార్క్ వ‌ర‌కు నిర్మించిన రోడ్డును జాతికి అంకితం చేస్తారు. అదేవిధంగా 10.45 గంట‌ల‌కు లెద‌ర్ పార్కును కూడా ప్రారంభించ‌నున్నారు. లెద‌ర్ పార్క్ వ‌ద్ద జీహెచ్ఎంసీ చేప‌ట్టిన వీయూసీ వంతెన ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. దీంతోపాటు పాత ముంబై హైవే నుంచి ఖాజాగూడ వ‌ర‌కు లింక్‌రోడ్‌ను ప్రారంభిస్తారు.  ఉద‌యం 11.45 గంట‌ల‌కు మియాపూర్‌, నిజాంపేట మ‌ధ్య లింక్ రోడ్డ‌ను ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ లింక్‌రోడ్ల ప్రారంభంతో ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ ఒత్తిడి త‌గ్గ‌నుంది.