మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 11:21:58

పంచ‌త‌త్వ పార్కును ప్రారంభించ‌నున్న కేటీఆర్‌

పంచ‌త‌త్వ పార్కును ప్రారంభించ‌నున్న కేటీఆర్‌

హైద‌రాబాద్‌: రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని పార్కుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించింది. ఇందులోభాగంగా ఇందిరా పార్కులో కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ పంచ‌త‌త్వ పార్కు‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించ‌నున్నారు. దీంతో ఈ ఉద్యాన‌వ‌నం నేటినుంచి అందుబాటులోకి రానుంది. దీనిని ఎనిమిది బ్లాకుల్లో ఎక‌రం విస్తీర్ణంలో ఆక్యూప్రేజ‌ర్ వాకింగ్ ట్రాక్‌‌ను నిర్మించారు. కంక‌ర‌రాళ్లు, న‌ల్ల‌రేగ‌డి మ‌ట్టి, నీరు, ఇసుక‌, చెక్క‌పొట్టు, గుల‌క‌రాళ్ల‌తో ట్రాక్‌ను నిర్మించారు. దీంతో దీనిపై న‌డుస్తున్న‌ప్పుడు పాదాల అడుగుభాగంలో ఉన్న న‌రాల‌పై ఒత్తిడి ఏర్ప‌డ‌నుంది. ఈ ట్రాక్ చుట్టూ వివిధ ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను పెంచుతున్నారు.