బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 13:29:11

ముస్తాబాద్‌లో వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ముస్తాబాద్‌లో వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లెల్ల నుంచి ముస్తాబాద్‌ మధ్యలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన వంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. 

మరికాసేపట్లో ముస్తాబాద్‌ సెస్‌ నూతన భవనాన్ని, పోతుగల్‌ - గండిలచ్చాపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన వంతెనను, కొండాపూర్‌ - నారాయణపూర్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. అనంతరం సిరిసిల్లలో అధికారులతో కేటీఆర్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.


logo