బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 15:33:29

300 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్‌

300 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్‌

ఖమ్మం: నగరంలో ఇండ్లులేని నిరుపేదలకు వైఎస్సార్‌ నగర్‌లో 240 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.134 కోట్లను కేటాయించింది. ఈ కాలనీకి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశారు.  ఇవాళ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్‌ సామూహిక గృహప్రవేశాలు  చేయించారు. దీంతో పేదల మోముల్లో వెలుగులు నిండాయి.   

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్‌ పాల్గొన్నారు.  అనంతరం రఘునాథపాలెంలో ఎంపీడీవో కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. రఘునాథపాలెంలో రెండు పడగ గదుల ఇళ్ల లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించారు. 60 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇవాళ మొత్తం 300 రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందించామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఖమ్మం అగ్రభాగాన ఉండాలని మంత్రి అజయ్‌ తపనపడుతున్నారని చెప్పారు. 


logo
>>>>>>