ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 08:06:02

నేడు పలు అభివృద్ధిపనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

నేడు పలు అభివృద్ధిపనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: జంట నగరాల్లో మంత్రి కేటీఆర్‌ నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.28.38 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు. దోమలగూడలో జోనల్‌, డిప్యూటీ కమిషనర్‌ కర్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నారాయణగూడలో మోడల్‌ కూరగాయల మార్కెట్‌కు భూమిపూజ చేస్తారు. బాగ్‌లింగంపల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. తొమ్మిది అంతస్థుల చొప్పున 126 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించారు. అడిక్‌మెట్‌లో కొత్తగా నిర్మించిన మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్బీనగర్‌ సర్కిల్‌లోని మోహన్‌నగర్‌లో నిర్మించిన జంట రిజర్వాయర్లను ప్రజలకు అంకితం చేస్తారు. ఈ జంట జలాశయాలను రూ.9.42 కోట్ల వ్యయంతో జలమండలి నిర్మించింది. వీటిలో 2.5 మిలియన్‌ లీటర్ల నీటిని నిల్వ ఉంచవచ్చు. వీటిని శాఫ్ట్‌ పద్ధతిలో నిర్మించారు. ఇలా నిర్మించినవాటిలో ఆసియా ఖండంలోనే ఈ జంట జలాశయాలు అతిపెద్దవి కావడం విశేషం. 


logo