బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 13:18:43

జూబ్లీహిల్స్ లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

జూబ్లీహిల్స్ లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌: పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 45 బస్తీ దవాఖానలను మంత్రులు ప్రారంభిస్తున్నారు. 


ఇవాళ జూబ్లీహిల్స్‌ లోని సుల్తాన్‌నగర్‌, యాదగిరి నగర్‌లో బస్తీదవాఖానను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానలను ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాత్‌, మేయర్‌ రామ్మోహన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు సైదాబాద్‌ జాకీర్‌ హుస్సేన్‌కాలనీ కమ్యూనిటీ హాల్‌ లో హోంమంత్రి మహమూద్‌ అలీ బస్తీ దవాఖానను ప్రారంభించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo