గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 13:12:40

లకారం మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

లకారం  మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 ఖమ్మం: జిల్లాలో  ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఉదయం ఖమ్మం జిల్లాకు చేరుకున్న మంత్రి  లకారం మినీ ట్యాంక్‌ బండ్‌ను   ప్రారంభించారు. మినీ ట్యాంక్‌బండ్‌పై స్కై సైక్లింగ్, ఒపెన్ జిమ్‌ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా మినీ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం నగరంలోని పెవిలియన్‌ మైదానంలో బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియం, శాంతినగర్‌లో నూతనంగా రూ. 2.6కోట్లతో నిర్మించిన కళాశాల భవనాలను, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాలను   ప్రారంభించారు. 

ఏఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కేటీఆర్‌ ముచ్చటించారు.   ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌,ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇంఛార్జ్‌ కలెక్టర్‌ ఎంవీరెడ్డి, సీపీ తప్సీర్‌ ఇక్బాల్‌   పాల్గొన్నారు. జిల్లాకు వచ్చిన కేటీఆర్ సహా ఇతర మంత్రులకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.logo