శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 14:22:50

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ ప్రారంభం

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ వార్డుతో పాటు కొవిడ్‌ అంబులెన్స్‌లను కేటీఆర్‌ ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈఈ కార్యాలయ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. జిల్లా ఆస్పత్రికి సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు అందిస్తామన్నారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా వాడుకోవాలన్నారు.

అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనాతో సహజీవనం తప్పదన్నారు. మాస్కులు ధరించి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 99 శాతం మంది రికవరీ అవుతున్నారు. వందకు వంద శాతం బాగుపడాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo