సోమవారం 01 జూన్ 2020
Telangana - May 22, 2020 , 13:55:48

ఎర్రగడ్డలో ఫ్లెక్సీల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ అసహనం

ఎర్రగడ్డలో ఫ్లెక్సీల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ అసహనం

హైదరాబాద్‌: తనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకుల తీరుపై మంత్రి కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా  ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌ బేగంకు రూ.20వేల జరిమానా వేయాలని అధికారులకు సూచించారు.  మాస్క్‌ లేకుండా వచ్చినందుకు కార్పొరేటర్‌ భర్త షరీఫ్‌కు రూ.వెయ్యి జరిమానా వేయాలన్నారు.  కార్పొరేటర్‌ దంపతులకు  జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎర్రగడ్డలోని యాదగిరి నగర్‌, సుల్తాన్‌ నగర్‌ బస్తీల్లో  మంత్రి కేటీఆర్‌ బస్తీ దవాఖానలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. logo