శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:08:52

అనాథ చిన్నారులకు మంత్రి కేటీఆర్‌ అండ

అనాథ చిన్నారులకు మంత్రి కేటీఆర్‌ అండ

శంకరపట్నం: ‘అమ్మానాన్నలు లేరని అధైర్యపడొద్దు.. పిలిస్తే మేమం తా పలుకుతాం.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తాం’ అని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అనాథ చిన్నారులకు భరోసా కల్పించారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లికి చెందిన నాగుల శారద-రమేశ్‌ దంపతులు మరణించడంతో పిల్లలు ఆలయ(9), అభినయ(11) అనాథలుగా మారారు. ఈ విషయాన్ని పూర్ణారావు అనే వ్యక్తి గురువారం ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి బాలికలకు అండగా నిలుస్తామని ప్రకటించారు. చిన్నారులకు సాయంచేయాలని కలెక్టర్‌ శశాంకకు ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన శుక్రవారం ఎరడపల్లికి వెళ్లి, ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని భరోసా కల్పించారు.  


logo