గురువారం 02 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 22:36:23

అభాగ్యులను ఆదుకున్న మంత్రి కేటీఆర్‌

అభాగ్యులను ఆదుకున్న మంత్రి కేటీఆర్‌

వీర్నపల్లి: మంత్రి కేటీఆర్‌ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన పొత్తూరి సునీల్‌కుమార్‌ 20 రోజుల క్రితం, వన్‌పల్లి గ్రామానికి చెందిన గునుకుల విజయ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదాల్లో గాయపడగా, ఇద్దరికీ కాళ్లు విరిగిపోయాయి. ప్రస్తుతం సునీల్‌ హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో, విజయ కరీంనగర్‌లోని అకీరా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి శస్త్రచికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతుండగా, పేదరికం అడ్డుగా మారింది. స్థానిక నాయకులు ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఇద్దరిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. సునీల్‌కుమార్‌, విజయకు చెరో రూ.2 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేయించారు. వైద్య చికిత్సకు సాయం అందించిన మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


logo