గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 02, 2020 , 16:33:19

సిరిసిల్ల‌ను ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి : కేటీఆర్

సిరిసిల్ల‌ను ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి : కేటీఆర్

హైద‌రాబాద్ : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ప‌నుల‌పై రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. సిరిసిల్ల ప‌ట్ట‌ణాన్ని ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల‌ని కేటీఆర్ సూచించారు. ఆ దిశ‌గా అధికార యంత్రాంగం ప‌ని చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌జారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్ర‌భుత్వ సేవ‌లు ఉండాల‌న్నారు. ప్రజారోగ్య సేవ‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని యంత్రాంగానికి కేటీఆర్ సూచించారు. సిరిసిల్ల‌లో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రుగులెత్తించాలి. సిరిసిల్ల‌లో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నుల పురోగ‌తిని కేటీఆర్ తెలుసుకున్నారు. సిరిసిల్ల‌లో చెరువుల‌న్నీ నిండాయి.. మంచి పంట‌లు పండే అవ‌కాశం ఉంద‌న్నారు మంత్రి.

కొవిడ్ బాధితుల‌కు అందిస్తున్న చికిత్స గురించి ఆయ‌న తెలుసుకున్నారు. సిరిసిల్ల‌కు అవ‌స‌ర‌మైన కొవిడ్ మెడిసిన్స్‌ను అందిస్తామ‌న్నారు. క్ల‌స్ట‌ర్ ఆస్ప‌త్రుల‌పై మ‌రింత దృష్టి పెట్టాల‌ని కేటీఆర్ సూచించారు. ఎల్లారెడ్డిపేట‌, వీర్న‌ప‌ల్లి, బండ‌లింగంప‌ల్లి పీహెచ్‌సీల‌ను వేగంగా నిర్మించాల‌ని ఆదేశించారు. విలీన గ్రామాల్లోనూ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వేగంగా కొన‌సాగించాల‌ని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో రైతు వేదిక‌ల నిర్మాణ ప‌నుల పురోగ‌తిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. 154 గ్రామాల్లో కొన‌సాగుతున్న ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల ప‌నుల తీరుపై కేటీఆర్ ఆరా తీశారు. 


logo