ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 14:53:58

రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిన కేటీఆర్

రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిన కేటీఆర్

హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్‌లోని ఎంఎస్ మ‌క్తా, రాజు న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ముంపు ప్ర‌భావిత కుటుంబాల‌కు త‌క్ష‌ణ సాయంగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన రూ. 10 వేల సాయాన్నిఅందించారు. ఒక్కో కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన కేటీఆర్.. వారికి రూ. 10 వేల చొప్పున న‌గ‌దు అందజేశారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ ఉన్నారు.