హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పలకడానికే ఇబ్బందిగా ఉన్న పలు మెడిసిన్స్ పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ చేశారు. ఇలాంటి కఠినమైన మందుల పేర్లు పెట్టింది ఎవరో ఎవరికైనా తెలుసా? అని నెటిజన్లను ప్రశ్నించారు. పొసకొంజల్, క్రెసెంబ, టొసిల్జుమాబ్, రెమ్డెసివిర్, లింపోసమల్ అంపోటెరిసిన్, ప్లావిపిరవిర్, మోల్నుపెరవిర్తోపాటు ఈ జాబితా ఇంకా ఉన్నదని ట్వీట్ చేశారు. వీటికి ఈ పేర్ల పెట్టడం వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాత్ర ఏమైనా ఉన్నదేమోననే అనుమానం కలుగుతున్నదని చమత్కరించారు. శశిథరూర్ తన ప్రసంగాల్లో కఠినమైన ఇంగ్లిష్ పదాలను వాడుతుంటారు. దాంతో మంత్రి కేటీఆర్ పై విధంగా ట్వీట్ చేశారు.