ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 17:23:15

హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా?!: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా?!: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.  సంజయ్‌ రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

'హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ ఏంటి?!   కొన్ని సీట్లు, ఓట్ల కోసం ఇంత దిగజారుతారా?. సహచర ఎంపీ విద్వేషపూరిత వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి సమర్థిస్తారా?' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని కేటీఆర్‌ నిలదీశారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? హైదరాబాద్‌ ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్   చేస్తామ‌ని,  రోహింగ్యాలు, పాకిస్తాన్, అఫ్గ‌నిస్థాన్‌ దేశీయుల‌ను   తరిమి తరిమి కొడతామ‌ని బండి సంజ‌య్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశాడు.