తెలంగాణ పైసలతో ఢిల్లీలో కులుకుతున్నరు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : గడిచిన ఆరేండ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 2 లక్షల 72 వేల కోట్లు వెళితే తిరిగి కేంద్రం మనకిచ్చింది ఎంతయ్యా అంటే రూ. లక్ష 40 వేల కోట్లు మాత్రమే. అంటే రూపాయి పోతే ఆటానా వెనక్కి వస్తుంది. మరి మిగతా ఆటానా ఎక్కడికి పోతుంది. మరి ఎవరు ఎవరికి ఇచ్చినట్టు. సొమ్ము ఎవరిది సోకు ఎవరిది. తెలంగాణ పైసలతో ఢిల్లీలో కులుకుతున్నరని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహణ చేపట్టారు. ఇందులో భాగంగా మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లకు సంబంధించి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ నగర్లో చేపట్టిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. మళ్లీ ఇక్కడివచ్చి ఏం మాట్లాడుతున్నరని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని తెలంగాణే ఎన్డీయే ప్రభుత్వానికి ఇస్తుందన్నారు. దేశాన్ని ఐదారు రాష్ర్టాలే సాకుతున్నాయన్న మంత్రి అందులో తెలంగాణ ఒకటన్నారు.
ఆరేళ్ల కిందట ఎన్నో అనుమానాలు, సందేహాలు, ప్రత్యర్థులు సృష్టించిన భయాందోళనలను పటాపంచలు చేశామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించాలని ప్రజలను అభ్యర్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కరెంట్ పరిష్కారం అయింది. మంచినీళ్ల సమస్య పరిష్కారం అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించాలన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటున్నమన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రూ. 5కే భోజనం. పేదవాడికి సుస్తీ చేస్తే బస్తీ దావాఖానాల ఏర్పాటు, సీసీ టీవీ కెమెరాలు, ఎల్ఈడీ లైట్లు, షీటీమ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం.
కర్ణాటకలో వరదలొస్తే ఆ రాష్ట్ర సీఎం ఉత్తరం రాస్తే నిధులు విడుదల చేస్తారు. గుజరాత్లో వరదలొస్తే ప్రధానే స్వయంగా వెళ్లి సాయం ప్రకటిస్తారు. అదే హైదరాబాద్‌కు వరదలొస్తే సీఎం లేఖ రాసినా కనీసం పట్టించుకోలేదన్నారు. మనని పట్టించుకోని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలన్నారు. శాంతియుతంగా ఒకరితో ఒకరం కలిసి ముందుకుసాగుతున్నామన్నారు. అందరికి తానొకటే విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బీజేపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే ఏం ఇచ్చింది మీ బీజేపీ హైదరాబాద్‌కు.. ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నరని ప్రశ్నించాల్సిందిగా కోరారు.
తాజావార్తలు
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు