ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:29:56

హీరో గిరి చేస్తామంటే స‌రికాదు.. కోమ‌టిరెడ్డికి కేటీఆర్ చుర‌క‌లు

హీరో గిరి చేస్తామంటే స‌రికాదు.. కోమ‌టిరెడ్డికి కేటీఆర్ చుర‌క‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి కేటీఆర్, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. జీరో అవ‌ర్‌లో కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్ప‌ల్‌, చండూరు మున్సిపాలిటీల‌కు ప్ర‌భుత్వం క‌నీస మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేక‌పోయింద‌ని అన్నారు. కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. చండూరు, చౌటుప్ప‌ల్ మున్సిపాలిటీల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డం లేద‌ని చెప్ప‌డం స‌త్య‌దూర‌మ‌ని కేటీఆర్ అన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి నెల మున్సిపాలిటీల‌కు రూ. 148 కోట్లు విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని కోమ‌టిరెడ్డి గ‌మ‌నించాలి. మొన్న జ‌రిగిన 130 మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే.. 122 మున్సిపాలిటీల్లో చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను కైవ‌సం చేసుకున్నాం. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమి చేయ‌క‌పోతే ఈ గెలుపు సాధ్య‌మ‌య్యేదేనా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. మీరు చెప్పేది విన్నారు.. తాము చెప్పేది కూడా విన్నారు. స‌త్య దూర‌మైన మాట‌లు మాని.. వాస్త‌వాలు మాట్లాడితే ప్ర‌జ‌లు కూడా హ‌ర్షిస్తార‌ని కేటీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో జీరో అవ‌ర్‌లో మైక్ ఇచ్చినా.. హీరో గిరి చేస్తామంటే స‌రికాద‌ని కోమ‌టిరెడ్డికి కేటీఆర్ చుర‌క‌లు అంటించారు.


logo