శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 16:07:48

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్న మంత్రి కేటీఆర్

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్న మంత్రి కేటీఆర్

జ‌న‌గామ:  ఐటీ, పుర‌పాల‌క‌,  శాఖ మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో  నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి అందరినీ ఆకర్శిస్తున్నారని పంచాయ‌తీరాజ్  శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కేటీఆర్ జన్మదినం జిల్లాలోని పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెరలో స‌హ‌జ క‌వి బ‌మ్మెర పోత‌నా మాత్యుని మందిరం ఆవ‌ర‌ణ‌లో మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేటీఆర్ మంత్రిగా, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా స‌క్సెస్ అయ్యార‌న్నారు. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే యూత్ కి కెటిఆర్ ఐకాన్ గా మారార‌న్నారు. కేటీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.


తాజావార్తలు


logo