మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 12:28:11

సుద‌ర్శ‌న్ రావు మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి

సుద‌ర్శ‌న్ రావు మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్ రావు మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. సుద‌ర్శ‌న్ రావు గుండెపోటుతో బుధ‌వారం ఉద‌యం మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మంత్రి ప్రార్థించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తొలి రోజుల నుంచి ప‌ని చేసిన వ్య‌క్తి సుద‌ర్శ‌న్ రావు అని కొనియాడారు. ఆయ‌న‌తో త‌న‌కు సుమారు రెండు ద‌శాబ్దాల అనుబంధం ఉంది అని కేటీఆర్ తెలిపారు. 

నిబ‌ద్ధ‌త క‌లిగిన ఉద్య‌మ‌కారుడిని పార్టీ కోల్పోయింది అని రాష్ర్ట ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్ విచారం వ్య‌క్తం చేశారు. సుద‌ర్శ‌న్ రావు కుటుంబ స‌భ్యుల‌కు వినోద్ కుమార్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. 


logo