మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 13:07:02

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. నీట్ ఫ‌లితాల్లో గురుకులాల విద్యార్థులు అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి మెరుగైన ర్యాంకులు సాధించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కేటీఆర్ అన్నారు. 

దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే నీట్ ఎగ్జామ్‌లో గురుకులాల విద్యార్థులు 100 మంది విద్యార్థుల‌కు పైగా ఉత్త‌మ ర్యాంకులు సాధించిన‌ట్లు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ అద్భుత‌మైన‌ ఫ‌లితాలు సాధించినందుకు విద్యార్థుల‌కు, టీచ‌ర్ల‌కు ఆయ‌న హ్యాట్సాఫ్ చెప్పారు. 2012-13 విద్యా సంవ‌త్స‌రంలో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఇప్పుడేమో 100 మందికి పైగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల‌ను సాధించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్‌, కేటీఆర్‌కు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. 

సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల విద్యార్థులు.. 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో ఎంబీబీఎస్‌లో 53, బీడీఎస్‌లో 27, 2019-20 విద్యాసంవ‌త్స‌రంలో ఎంబీబీఎస్‌లో 102, బీడీఎస్‌లో 40 సీట్లు సాధించారు.

గిరిజ‌న సంక్షేమ గురుకుల కాలేజీల విద్యార్థులు.. 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో ఎంబీబీఎస్‌లో 21, బీడీఎస్‌లో 07, 2019-20 విద్యాసంవ‌త్స‌రంలో ఎంబీబీఎస్‌లో 30, బీడీఎస్‌లో 18 సీట్లు సాధించారు.


logo