మంగళవారం 14 జూలై 2020
Telangana - Apr 11, 2020 , 15:50:28

హువెల్‌ లైఫ్‌సైన్సెస్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

హువెల్‌ లైఫ్‌సైన్సెస్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన హువెల్‌ లైఫ్‌సైన్సెస్‌కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. కంపెనీ వ్యవస్థాపకులు శిశిర్‌, రచన నేడు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ నిర్దారణ టెస్టింగ్‌ కిట్‌ను మంత్రికి చూపించారు. ఈ కిట్లు రెండు గంటల్లో ఫలితాలను తేల్చనున్నాయి. ఈ టెస్టింగ్‌ కిట్లను మంత్రి పరిశీలించారు. బాగున్నాయని ప్రశంసించిన మంత్రి హువెల్‌ లైఫ్‌సైన్సెస్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.


logo