మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:02

ఎమ్మెల్సీలకు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్మెల్సీలకు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో శుక్రవారం హైదరాబాద్‌లో పలువురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. తనను కలిసిన ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, పోలీస్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌గుప్తాకు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తిచేసుకున్న వెంకటేశ్‌ నేత.. కేటీఆర్‌ను కలిశారు.  ఆయన వెంట ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ తదితరులున్నారు. మరోవైపు, 2020కిగాను వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికైనందుకు బయోకాన్‌ ఎండీ కిరణ్‌ముజుందార్‌ షాకు కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.logo