బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 10:06:46

ఖమ్మం చేరుకున్న మంత్రి కేటీఆర్‌

ఖమ్మం చేరుకున్న మంత్రి కేటీఆర్‌

ఖమ్మం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఖమ్మం చేరుకున్నారు. కేటీఆర్‌ వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ వెళ్లారు. మంత్రులకు జిల్లా ముఖ్య నేతలు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్యకర్తలు స్వాగతం పలికారు.  మధ్యా హ్నం 12.30 గంటల వరకు ఖమ్మంలో జరిగే పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా నగరంలో మినీ ట్యాంక్‌బండ్‌ను, శాంతినగర్‌ జూనియర్‌ కళాశాలను, సీసీ కెమెరాల వాల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను, పెవిలియన్‌ గ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియాన్ని, ఎన్సీపీ క్యాంప్‌లో నిర్మించిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను మంత్రి ప్రారంభిస్తారు. అక్కడే అధికారులు ప్రజాప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. అనంతరం రఘునాథపాలెం వైఎస్సార్‌నగర్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు.


logo