గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 21:33:22

కుడా మాస్టర్‌ప్లాన్‌కు మంత్రి కేటీఆర్‌ ఆమోదం

కుడా మాస్టర్‌ప్లాన్‌కు మంత్రి కేటీఆర్‌ ఆమోదం

హైదరాబాద్‌:  వరంగల్‌ జిల్లా నేతలతో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు. కుడా మాస్టర్‌ ప్లాన్‌కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..హైదరాబాద్‌ తరహా మెట్రో రైలుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని నేతలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. మామునూరు విమానాశ్రయానికి కేంద్రం సూత్రపాయ అంగీకారం తెలిపింది. వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వెయ్యి పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి. స్మార్ట్‌ సిటీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. పట్టణ ప్రగతి నిధుల్లో మూడో వంతు శివారు ప్రాంతాలకు కేటాయించాలి. వరంగల్‌ నాలుగు వైపులా డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. దసరాలోపు 3900 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ నెల 16న మరోసారి సమావేశం కావాలని  మంత్రి కేటీఆర్‌ నిర్ణయించారు. 


logo