బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:21:47

వెల్‌డన్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

వెల్‌డన్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

  • ట్విట్టర్‌లో అభినందించిన మంత్రి కేటీఆర్‌ 

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌పై ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులను మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు. ‘వెల్‌డన్‌ ట్రాఫిక్‌ పోలీస్‌' అంటూ గురువారం ట్విట్టర్‌ వేదికగా మెచ్చుకున్నారు. బుధవారం హైదరాబాద్‌ కొత్తపేట చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడిన సమయంలో నిలిచిన వాహనచోదకులు, బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ అదనపు సీఐ నాగమల్లు.. సిబ్బందితో కలిసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. గురువారం కూడా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద నాగమల్లు అవగాహన కల్పించారు.


logo
>>>>>>