శుక్రవారం 03 జూలై 2020
Telangana - May 24, 2020 , 22:40:47

26న చొప్పదండిలో పర్యటించనున్న మంత్రులు

26న చొప్పదండిలో పర్యటించనున్న మంత్రులు

బోయినపల్లి : ఈనెల 26న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ రానున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. బోయినపల్లి, కోరెం, కొదురుపాక, విలాసాగర్‌ గ్రామాల్లో రైతు వేదికలు మంజూరయ్యాయని, కార్యక్రమం భూమి పూజకు వారు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోయినపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రైతూ అధునాతన పంటలు వేసి అభివృద్ధిలో పయనించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతు వేదికలకు రూప కల్పన చేశారని ఆయన చెప్పారు.

 రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయన్నారు. కాలానుగుణమైన పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా వేయాలని, అప్పుడే డిమాండ్‌ ఉంటుందని సూచింరాఉ. ఏ రకాల పంటలు వేయాలని నిర్ణయం తీసుకునేందుకు రైతు వేదికలు ఉపయోగ పడతాయన్నారు. మంత్రులు వచ్చే కార్యక్రమానికి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, గుర్తించిన 200 మంది రైతులు మాత్రమే రావాలని, కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. అనంతరం బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి రైతు వేదికకు కరారు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేణుగోపాల్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఏడీఏ భాస్కర్‌, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.logo