గురువారం 09 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 23:12:20

ఆపత్కాలంలో టెక్నాలజీ ఉపయోగపడింది: కేటీఆర్‌

ఆపత్కాలంలో టెక్నాలజీ ఉపయోగపడింది: కేటీఆర్‌

హైదరాబాద్‌: వరల్డ్‌ ఎకానామిక్‌ ఫోరమ్‌ మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. రిజనల్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ సౌత్‌ ఏసియా సమావేశంలో కరోనా నియంత్రణలో ఎమర్జంగ్‌ టెక్నాలజీల పాత్ర అనే అంశంపై మంత్రి మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌తో పాలు సమావేశంలో పలు దేశాల మంత్రులు పాల్గొన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అధ్యక్షులు, ఎండీ, పలు దేశాల నిపుణులు, కంపెనీల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ...  ప్రజలకు, ప్రభుత్వాలకు కరోనా ఆపత్కాలంలో టెక్నాలజీ ఉపయుక్తంగా ఉంది. సమస్య పరిష్కారంతో పాటు నూతన అవకాశాలకు కరోనా సమయం తెరతీసింది. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడి జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలి. కరోనా కట్టడి, ప్రజలను చైతన్య పరచడంలో సాంకేతికత సహాకరించిందని తెలిపారు. 


logo