శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 20:31:33

సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మొదలైన సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ కొనసాగుతుంది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ విసిరిన సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ ను మంత్రి కేటీఆర్‌ స్వీకరించారు. సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా..కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమైందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. చేతులను శానిటైజర్‌తో ఇలా కడుక్కోవాలని కేటీఆర్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ అనంతరం ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు హర్‌ దీప్‌ పూరి,  పీయూష్‌ గోయల్‌ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మార్క్‌ బెనిఆఫ్‌ లను సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.  logo