సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 19:55:43

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కొప్పుల

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కొప్పుల

జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాయికల్ మండలం మేడిపల్లి, బోర్నపల్లిలో రూ.70 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ వంతెనను ప్రారంభించారు. అనంతరం బోర్నపల్లి నుంచి కడెం వరకు ఆర్టీసీ బస్‌ను ప్రారంభించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా కలెక్టర్ రవి, ఆర్డీవో మాధురి  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

న్యూడ్ ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ న‌టి 

ఆర్టీసీ బస్సును ఢీకొని ఒకరి మృతి 

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి 


logo