ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 20:47:21

రైతువేదికను ప్రారంభించిన మంత్రి కొప్పుల

రైతువేదికను ప్రారంభించిన మంత్రి కొప్పుల

జగిత్యాల : దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పద్ధతిలో రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం మేడిపల్లి మండలం పోరుమల్లలో గ్రామంలో రైతువేదిక, కాల్వకోటలో డబుల్‌బెడ్‌ రూం ఇండ్ల   ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ వ్యవసాయ దారులకే కాకుండా పరిశ్రమలకు గృహలకు అందిస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.


logo