న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఎఫెక్ట్ సామాన్యులకు మాత్రమే పరిమితం కాలేదు… ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు.. కార్పొరేట్ కంపెనీలపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నది. వివిధ సంస్థలు తమ భవిష్యత్ అవసరాలు, పెట్టుబడి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి తమ అప్రధాన ఆస్తులు, నాన్ కోర్ అసెట్స్‌లో పెట్టుబడుల ఉప సంహరణ దిశగా అడుగులేస్తున్నారని ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మూడోంతుల కంపెనీలు వాటాల ఉపసంహరణకే మొగ్గుతున్నాయి.
ఆయా కార్పొరేట్ సంస్థలు తమ ద్రవ్య లభ్యత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు, వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన నిధుల సేకరణకు ఇతర సంస్థల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 30 సంస్థల పనితీరుపై సదరు కన్సల్టెన్సీ సంస్థ ఈవై సర్వే జరిపింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం ప్రతినిధులు.. వచ్చే రెండేండ్లలో ఇతర సంస్థల్లో తమ వాటాలను ఉపసంహరించనున్నట్లు చెప్పారు. బిజినెస్ అవసరాలకు పెట్టుబడి మద్దతు అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి స్రుష్టించిందని వారు చెప్పారు. ప్రస్తుత సంక్షోభ తరుణంలో కీలక సంస్థల్లో ద్రవ్య లభ్యత సమస్యను అధిగమించేందుకు నిధులు అవసరం అని, అందుకు సకాలంలో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
కష్ట కాలంలో కంపెనీల పునఃనిర్మాణంలో కోర్ బిజినెస్‌పై ద్రుష్టిని కేంద్రీకరించాయని కన్సల్టెన్సీ సంస్థ భాగస్వామి నవీన్ తివారీ చెప్పారు. వాటాల ఉపసంహరణకు, ఆస్తుల విక్రయానికి సరైన సమయాన్ని నిర్ణయించడం ఆయా సంస్థల సీఈవోల ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు.
70 శాతం కంపెనీలు తమ ఆస్తులను విక్రయించే పనిలో పడ్డాయి. ప్రతి బిజినెస్‌లోనూ పెట్టుబడుల ఉపసంహరణ విభాగాలను గుర్తించడం, కోర్ బిజినెస్‌పై కేంద్రీకరించడం ప్రధానం అని కన్సల్టెన్సీ సంస్థ ఈవై తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల గతేడాది జీడీపీ గ్రోత్ 7.3 శాతానికి పడిపోయింది. 2021-22లోనూ రెండంకెల గ్రోత్ కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్‌లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?