బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 22:34:24

నిరుపేదకు ఎల్‌ఓసీ అందించిన మంత్రి కొప్పుల

నిరుపేదకు ఎల్‌ఓసీ అందించిన మంత్రి కొప్పుల

జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మహిళకు సంక్షేమ శాఖల మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. చికిత్స చేయించుకునేందుకు బాధితురాలికి ఎల్‌ఓసీ ( లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌)ని అందజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాం గ్రామానికి చెందిన చిన్నారి అనూష అనారోగ్యం తో బాధపడుతోంది. చికిత్స చేసుకుని స్థోమత లేకపోవడంతో స్థానిక నాయకుల సహకారంతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసింది. దీంతో ఆయన ఆమె దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని నిమ్స్ ఆసుపత్రి ద్వారా మంజూరైన రూ. లక్షా యాభై వేల ఎల్‌ఓసీని లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.