శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 15:03:35

మాజీ మంత్రి నర్సయ్యకు నివాళులు అర్పించిన మంత్రి కొప్పుల

మాజీ మంత్రి  నర్సయ్యకు నివాళులు అర్పించిన మంత్రి కొప్పుల

పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేడారం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య భౌతిక కాయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వెంట రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.


logo