సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 20:24:50

మాతంగి నర్సయ్య మృతిపై సంతాపం తెలిపిన మంత్రి కొప్పుల

మాతంగి నర్సయ్య మృతిపై సంతాపం తెలిపిన మంత్రి కొప్పుల

హైదరాబాద్ : మాజీ మంత్రి, మాతంగి నర్సయ్య మృతి పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాతంగి నర్సయ్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి నర్సయ్య చేసిన కృషిని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 


logo