బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 11:39:40

సాయిరాంకు చికిత్స చేయిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ

సాయిరాంకు చికిత్స చేయిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన సాయిరాం రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితమైనాడు. వారిది నిరుపేద కుటుంబం చికిత్స చేయించుకోలేని పరిస్థితి. చిన్న తనంలోనే తండ్రి మరణించాడు. దీంతో రెక్కాడితే డొక్కాడని దీనస్థితిలో ఉన్నారు. తల్లి కూలి చేస్తే గానీ కుటుంబం గడవని పరిస్థితి. ఎలాగోలా బీటెక్‌ వరకు చదివి బ్రతుకుపోరాటం చేస్తున్న యువకుడు గాలిపెల్లి సాయిరాం దీన స్థితిని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఆయనే స్వయంగా సాయిరాంకు ఫోన్‌ చేసి మాట్లాడారు. తనకు అవసరమైన చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో సాయిరాం, అతని కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ZPTC సుధారాణి రామస్వామి సాయిరాం కుటుంబ సభ్యులకు రూ. 5 వేలు, ఎంపీటీసీ పెద్దూరి హారిక భరత్ రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట గుండ జగదీశ్వర్, గంట్యాల రాజేందర్, హనుమాన్ యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo