ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 16:56:44

వృద్ధుడి ఫోన్ కాల్ కి తక్షణమే స్పందించిన మంత్రి కొప్పుల

వృద్ధుడి ఫోన్ కాల్ కి తక్షణమే స్పందించిన మంత్రి కొప్పుల

జగిత్యాల : జిల్లాలోని వెల్లటూరు మండలం ముక్కట్రావుపేట్ గ్రామానికి చెందిన కొప్పుల ప్రకాశ్ అనే వృద్ధుడు గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కరోన సమయంలో కనీస నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఫోన్ ద్వారా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తన పరిస్థితిని వివరించాడు. వెంటనే మంత్రి స్పందించి ఈ రోజు మండల టీఆర్ఎస్ నాయకుల ద్వారా సుమారు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను అందించారు.

ఈ సందర్భంగా ఆ వృద్ధుడు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల సురేష్, టీఆర్ఎస్ మండల యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రసాద్, గ్రామ విద్యార్థి విభాగ అధ్యక్షుడు బేతపు వినయ్ పాల్, తదితరులు పాల్గొన్నారు.


logo