శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 12:57:52

రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల : జిల్లాలోని పెగడపల్లి మండలం నార్సింపేట గ్రామంలో గురువారం రేషన్ దుకాణాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన మంత్రి లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే ముందున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో  జెట్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు, ఎంపీపీ గోలి శోభ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి నాయక్, వైస్ చైర్మన్ రమణ, పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు.logo