మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 20:36:31

కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు

కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత విజయం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన కవితకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఆమెను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని తాజా ఎమ్మెల్సీ ఉపఎన్నిక తీర్పుతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా ఆ రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతే అంటూ మంత్రి పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo