మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:01:58

‘అంబేద్కర్‌ స్మారక కేంద్రం’ వేగవంతం

‘అంబేద్కర్‌ స్మారక కేంద్రం’ వేగవంతం

  • సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశం గర్వించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న అంబేద్కర్‌ స్మారక కేంద్రం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. సోమవారం బీఆర్కేభవన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ 2016లో అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహాన్ని ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద ఏర్పాటుచేస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు కార్యాచరణ కొనసాగుతున్నదని చెప్పారు. 11 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు, బాబాసాహెబ్‌ జీవితంలో ముఖ్యఘట్టాలతో ప్రదర్శనశాల అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేకకార్యదర్శి విజయ్‌కుమార్‌, డైరెక్టర్‌ కరుణాకర్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo