శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 22:04:11

చివరి ఆయకట్టుకు నీరందించడమే ధ్యేయం

చివరి ఆయకట్టుకు నీరందించడమే ధ్యేయం

బుగ్గారం : కాలువల ద్వారా చివరి ఆయకట్టు రైతులకు నీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుగ్గారం మండలంలోని మద్దునూర్‌లో ఎస్సారెస్పీ డీ 53, 2ఎల్‌ కాలువ పునరుద్ధరణలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి పూడికతీత పనుల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. చిన్నాపూర్‌లో రూ.160లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు, రూ.5లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువలు, సబ్‌ కాలువలు నూటికి నూరు శాతం పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో చేపట్టామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా ధర్మపురి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాగా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన దివ్యాంగులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అండగా నిలిచారు. మండలంలోని 25మంది దివ్యాంగులకు ఆశ్రాయ్‌, ఆకృతి హైదరాబాద్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు  తదితరులు పాల్గొన్నారు. logo