శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 14, 2020 , 19:08:28

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి కొప్పుల

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి కొప్పుల

కరీంనగర్‌: జిల్లాలోని చొప్పదండి నుంచి ఆర్నికొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రోడ్డు వెంట వెళుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ భూమయ్యను గమనించారు. కాన్వాయ్‌ ఆపి నీళ్లు తాగించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కాన్వాయ్‌లో భూమయ్యను కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అతని కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. 
logo